Saturday 16 April 2016

నెమలి కన్ను

☘☘☘☘☘ నెమలి కన్ను..☘☘☘☘☘

నెమలి కన్ను ను చూస్తే బాల్యం గుర్తొస్తుంది..

పుస్తకాల్లో దాచుకొని, రోజూ పిల్ల పుట్టిందా లేదా ..

అని వెతుక్కుంటూ..ఒక రోజున అద్భుతంగా ..పక్కనే మరో సన్న ఈనె

కనబడుతుంది..అదేమిటో..అది పెరిగి మళ్ళీ ఇంకో నెమలి కన్ను

అయిపోతుందనే భావన..పక్కనున్న స్నేహితురాలు చెప్తుంది కూడా..

ఇదిగో..నా నెమిలీక ఎంత పెద్దగా అయ్యిందో అని..

మరి మన నెమిలీక అలా ఎప్పటికి పెరుగుతుందో అని ఆశ..

ఎవరిని అడగాలి..? అమ్మని అడిగితే నవ్వేస్తుంది..'నువ్వు పాలు తాగితే

అదే పెరుగుతుంది 'అని మాయచేస్తుంది..

అన్నని అడిగితే..'మొద్దూ..నెమిలీక పిల్లలు పెడుతుందా ..?'అని

వెక్కిరింత..అక్కకి చూపిస్తే..తన చెంపలకి మృదువుగా రాసుకొని..

మై మరచిపోతూ .'.ఎంతబావుందో..నాకివ్వరాదుటే'..అనేస్తుంది.

చేల్లికేం తెలీదు..లాగి చిమ్పేస్తుంది..

ఫ్రెండ్స్ కి చూపిస్తే..'అమ్మో..నేను చూడకుండా కొట్టేయ్యరూ..'

మరెలా..? ఎలా తెలుస్తుంది..'నెమిలీక పిల్లలు పెడుతుందో లేదో..?'

అందుకే..అలా పుస్తకాల్లో దాచుకొని చూసి మురిసిపోవడం..

ఎప్పటికైనా నా నెమిలీక పిల్లలు పెట్టకపోతుందా  అని..

అందుకే..నా అమాయక బాల్యం నాకెంతో ఇష్టం..!!!


         ----------Usha

-----------------26/04/2014


2 comments:

  1. మీ బ్లాగ్ అంతా చూసాను. చాలా చక్కగా వ్రాస్తున్నారు ఉష గారు. ఇలాగే ఉత్సాహంగా కొనసాగించండి. శుభాభినందనలు.

    ReplyDelete
  2. మీరు ఓపికగా చూసి , సమీక్షించినందుకు చాలా చాలా ధన్యవాదాలు వనజ గారూ.. మీ ప్రోత్సాహం మరువలేనిది.. థాంక్యూ వన్స్ అగైన్..😀💐

    ReplyDelete