Sunday 16 April 2017

యాండోయ్ -ఇలాగొచ్చి ఓమాటినిపోండీ....!!


------- యాండోయ్ -ఇలాగొచ్చి ఓమాటినిపోండీ----!!!
               నేను౦డే  గౌరీపట్నం కి దగ్గరలో అంటే 5 కిమీ . దూరంలో పంగిడి అనే వూరు వుంది.అక్కడ
బుధవారం సంత.కూరలు ఒక్కటే చూసాను.ఇంకా గుడ్లూ ,చేపలూ,మాంసమూ అవీ కూడా
ఉన్నట్టున్నాయి. కూరల రేట్లు మాత్రం మండి పోతున్నాయి. ఏది అడిగినా పావుకిలో 10 రు., 15
రు.బేరం ఏమీలేదు . సరే తప్పేదేముందీ ? కూరగాయలు మాత్రం ఫ్రెష్ గాలేవు,,.అలాచూస్తూ కొంటుంటే..అక్కడ వాళ్ళ మాటలు వినపడ్డాయి.
"యాండీ..వుల్లిపాయలెంత.." "యాండీ గోంగూర ఎలగిస్తారు..?" "యాండీ .పచ్చిరగాయలు
(పచ్చిమిర్చి ) ఎలగేటీ ." అని..అదే మన హైదరాబాద్  లో అయితే .,కేకలు పెడుతూ పిలవడం, మాదగ్గర తీసుకోమనడం ,బ్రతిమిలాడటం ఉంటుంది ..ఇక్కడ అదేమీ
ఏమీ లేదు . ఇష్టమైతే కొనుక్కో..అనే టైప్ లో వున్నారు. గోరుచిక్కుడు ఎండిపోయి వుంటే
మావారు.."ఎన్టీ..ఇలా ఎండిపోయి వుంటే ఎలా..? ఫ్రెష్ గా వుండాలి.." అన్నారు. "సార్
గారండీ..ఎండలు ఎలాగున్నాయి చెప్పండి..? కావాలనుకొంటే కొనుక్కోవాలండి..లేపోతే
మానుకోవాలండి.." అన్నాడు మర్యాదగానే .
హైదరాబాద్ లో 'మీరు' అన్న మాట వినపడదు.నువ్వ
నే అంటారు."దోసకాయలు గారంటీగా చేదు ఉండవా ..?"..అంటే.." నువ్వు బలేగజెప్తవ్ సారూ
..మన బతుక్కే గారంటీ లేదు..ఇగకూర గాయలకి యాడ గారంటీ ఇద్దు చెప్పు.." అని..కొట్టిపారేస్తారు.

మరోపక్కన ఉల్లిపాయలు కొందామని వెళ్ళా.  "ఎంత బాబూ.." అని నేనడిగే లోపు నా వెనుకే.."
యాండీ ..వుల్లిపాయలెన్తండీ.." అని వినపడింది. తిరిగి చూసా..ఆవిడ ఆకారానికి, అడిగిన తీరు
,సంస్కారానికి ఆశ్చర పోయేలోపే.. అతను  .." పదేన్రూపాలండీ..కిలో.." అన్నాడు.ఈవిడ
వుల్లిపాయలేరి  తూకం గిన్నెలో పోసింది . అతను రెండు తీసి ..పక్కనపడేసాడు." బలేటోరండీ
..బంగారంలాగా జేత్తన్నారే..రొండు ఎక్కువైనాయేటండీ..వున్నీయండి..".అంది ఈవిడ.

"మరి..రొండ౦న్టే ..100 గ్రా.ఉంటాదండీ .." అన్నాడు.ఇక్కడ నేను చెప్పాలనుకొంటుంది
వారి మధ్య మర్యాద పూర్వక సంభాషణ .ఒకరినొకరు గౌరవించుకోవడం. నాకు చాలా ఆశ్చర్యం
అనిపించింది. సమాజంలో ఉన్నత వర్గాల మధ్య వుండే గౌరవ మర్యాదలు ,లోవర్ మిడిల్ కంటే
తక్కువ గా వుండే వారు కూడా అలవర్చుకొన్నారు. అదీ..నాకు నచ్చింది.
అలాగే  " సార్ గారండీ " "మేడమ్ గారండీ" అనే పిలుస్తారు ...తమాషాగా అనిపించింది నాకు ...తూగోజీవాళ్ళకి ఎటకారాలేకాదు ...మర్యాదలూ ఎక్కువే ... ఏమంటారూ ..:)


No comments:

Post a Comment